Sunday, January 19, 2025
HomeసినిమాTrivikram, Chiranjeevi: త్రివిక్రమ్ మూవీ చిరుతోనా..? బన్నీతోనా..?

Trivikram, Chiranjeevi: త్రివిక్రమ్ మూవీ చిరుతోనా..? బన్నీతోనా..?

చిరంజీవి.. మల్లిడి వశిష్ట్ తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా కంటే ముందుగా కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. అది రీమేక్ కావడంతో.. భోళాశంకర్ రిజెల్ట్ చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఊహించని విధంగా ఇప్పుడు చిరంజీవితో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి గతంలో త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అనుకున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు చిరు – త్రివిక్రమ్ కాంబో గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్ బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి కదా..? మరి.. చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారనుకుంటున్నారా..? మేటర్ ఏంటంటే.. బన్నీ, అట్లీ మధ్య కథాచర్చలు జరుగుతున్నాయి.

ఇటీవల బన్నీ, అట్లీ ముంబాయిలో కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి చేసే సినిమా గురించి చర్చలు జరిగాయి కానీ.. ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. బన్నీ అట్లీతో సినిమా చేసే టైమ్ లో  త్రివిక్రమ్.. చిరుతో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ‘ఖైదీ’ సినిమాకి సీక్వెల్ చేయాలి అనుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ఐడియా చిరుకు బాగా నచ్చిందట. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ సెట్ కావాలని కోరుకుంటున్నారు. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Also Read: Chiranjeevi 45 Years Journey: మెగాస్టార్‌ చిరంజీవికి గ్లోబల్ స్టార్ అభినందనలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్