Sunday, January 19, 2025
HomeసినిమాThe Family Man: చిరు ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ చేసుంటే...?  

The Family Man: చిరు ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ చేసుంటే…?  

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి అంటూ వచ్చారు. స్టైలీష్ మేకర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. అయితే.. ఇది తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యింది కానీ.. మిగిలిన భాషల్లో మాత్రం అంతగా ఆడలేదు. ఆతర్వాత చేసిన ఆచార్య సినిమా అయితే డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత చేసిన గాడ్ ఫాదర్ ఫరవాలేదు అనిపించింది. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ సాధించారు.

తాజాగా వచ్చిన భోళాశంకర్ మూవీతో డిజాస్టర్ చూడాల్సివచ్చింది. అయితే.. చిరంజీవి గురించి సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ మాట్లాడుతూ… ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. మేటర్ ఏంటంటే.. ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ ఇండియా వైడ్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని మెగాస్టార్ చిరంజీవితో చేయాలి అనుకున్నారట. రాజ్ అండ్ డీకే, అశ్వనీదత్ వెళ్లి చిరంజీవిని అడిగితే.. అప్పటికే ఖైదీ నెంబర్ 150 సక్సెస్ సాధించాం. నెక్ట్స్ సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా మూవీ చేయాలి అనుకుంటున్నామని వెబ్ సిరీస్ కి నో చెప్పారట.

అంతే కాకుండా ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ చిరంజీవి చేసుంటే వేరే లెవెల్ లో ఉండేదని అశ్వనీదత్ అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే… బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట్ తో చేయనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా కంటే ముందుగా మరో సినిమా చేయనున్నారు. ఆ సినిమాను కళ్యాణ్ కృష్ణతో ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే..ఇప్పుడు ఈ మూవీ ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్