Sunday, January 19, 2025
Homeసినిమా‘చిన్నారి’ ఘటనపై చిరంజీవి ఆవేదన

‘చిన్నారి’ ఘటనపై చిరంజీవి ఆవేదన

ఇటీవల హైదరాబాద్ లోని డిఏవి స్కూల్ లో చోటు చేసుకున్న ఘటనపై మెగా స్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ లో అయన స్పందించారు. అన్ని విద్యా సంస్థల్లో సిసిటివిల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం,అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది.  ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు.

Also Read : గతి తప్పిన పాఠం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్