Monday, March 31, 2025
Homeసినిమాకైకాల ఆరోగ్యం పై 'చిరు' అప్ డేట్

కైకాల ఆరోగ్యం పై ‘చిరు’ అప్ డేట్

Chiranjeevi Updated About The Health Of Kaikala Satyanarayana

సీనియ‌ర్ న‌టులు కైకాల స‌త్య‌నారాయ‌ణ శ‌నివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. వెంట‌నే కుటుంబ స‌భ్యులు అపోలో హాస్ప‌ట‌ల్ లో జాయిన్ చేశారు. ఆయ‌న ఆరోగ్యం కాస్త సీరియ‌స్ గానే ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డం తెలిసిందే. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కైకాల ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యం పై స్పందించారు. ట్విట్ట‌ర్ లో చిరంజీవి స్పందిస్తూ… సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చిరంజీవి తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం. ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి.. అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థమ్సప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్‌ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని చిరంజీవి తెలియ‌చేశారు.

Also Read :కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్