Friday, March 20, 2026
Homeసినిమాపవన్, చరణ్‌ ఇద్దరినీ వాడేసిన భోళా శంకర్

పవన్, చరణ్‌ ఇద్దరినీ వాడేసిన భోళా శంకర్

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఇందులో చిరుకు జంటగా తమన్నా నటిస్తే.. సిస్టర్ గా కీర్తి సురేష్‌ నటించింది. సుశాంత్ కీలక పాత్ర చేయడం విశేషం. ఈ చిత్రం నుంచి టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే.. రీమేక్ మూవీ కావడం వలనో.. ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్‌ ఈ చిత్రానికి దర్శకుడు కావడం వలనో ఈ సినిమాకి ఎంత చేసినా రావాల్సినంత బజ్ రావడం లేదు. ఆగష్టు 11న ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

ఇదిలా ఉంటే.. మాములుగా చిరంజీవి సినిమాల్లో ఆయన కుటుంబ హీరోల రెఫరెన్సులు ఉండవు. మెగాస్టార్ బ్రాండ్ నే మిగిలినవాళ్లు వాడుకోవడం చూశాం కానీ భోళా శంకర్ విషయంలో మాత్రం దానికి మినహాయింపు ఇచ్చేశారు. ఇందులో పవన్, చరణ్ లను స్వేచ్ఛగా వాడేసుకున్నారు. శ్రీముఖితో సరదాగా జరిగే లవ్ ఎపిసోడ్ ని ఖుషి తరహాలో డిజైన్ చేశారన్న లీక్ ఎప్పుడో వచ్చింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నట్టుగా ట్రైలర్ లో ఒక షాట్ తో దాన్ని రివీల్ చేశారు. అ ఆ అంటూ అచ్చం తమ్ముడి కాలర్ మ్యానరిజంని దించేశారు. ఏ మేరా జహా పాటని యుజ్ చేయడం ఆల్రెడీ టీజర్ లో చూసేశాం.

ఇక తమన్నాతో రంగస్థలం బాబు అనిపించడం కూడా ఈ స్ట్రాటజీలో భాగమే. అయితే.. ఈ వాడకం ఏ మేరకు పేలిందనేది థియేటర్లో చూస్తే కానీ అర్థం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆడియన్స్ ని వీటిని స్పూఫ్ గా చూస్తారని, అదే జరిగితే కథలో సీరియస్ నెస్ డైవర్ట్ అవ్వొచ్చని కొంత మంది అభిమానుల ఫీలింగ్. అందులో పాయింట్ లేకపోలేదు. ఎందుకంటే నలభై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడూ ఇలా చేయని చిరు ఇప్పుడు ఇలా టర్న్ తీసుకోవడం ఆశ్చర్యమే. ఆయన నిర్ణయం సరైనదా..? కాదా..? అనేది సినిమా చూశాకే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular