Chiru devotional tour: మెగాస్టార్ చిరంజీవి ఆదివారం గురువాయూర్ ఆలయంతో పాటు శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గురువాయూర్ లోని శ్రీవల్సం అతిథి మందిరానికి చేరుకున్న చిరంజీవి దంపతులు విశ్రాంతి అనంతరం నాలుగున్నర గంటలకు ఆలయానికి చేరుకున్నారు.
దేవస్థానం పాలక కమిటీ సభ్యుడు మల్లిస్సేరి పరమేశ్వరన్ నంబూతిరిపాడ్, అడ్మినిస్ట్రేటర్ కె.పి.వినయన్, మాజీ పాలకమండలి సభ్యుడు కె.వి.షాజీ స్వాగతం పలికారు. అనంతరం శ్రీకోవిల్ ఎదుట చిరంజీవి దంపతులు పూజలు చేసి పూజలు చేశారు.
అంతకుముందు ఆదివారం ఉదయం శబరిమలలోని అయ్యప్ప స్వామిని కూడా చిరంజీవి దంపతులు దర్శించుకున్నారు. డోలీ ద్వారా అయ్యప్ప సన్నిధికి చేరుకున్న చిరు తనను మోసిన కార్మికులకు అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా తెలియజేశారు.
“చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్ళవలసి వచ్చింది. ఆ పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధారపోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయంజలి…. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపీ గార్ల కుటుంబాల తోడు మంచి అనుభూతినిచ్చింది’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.