Tuesday, March 10, 2026
Homeసినిమా‘రంగమార్తాండ’ కు మెగాస్టార్ వాయిస్ ఓవర్

‘రంగమార్తాండ’ కు మెగాస్టార్ వాయిస్ ఓవర్

క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన నటసమ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు రంగమార్తాండ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అంతే కాకుండా.. చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ‘మా రంగ మార్తాండ సినిమాకు వాయిస్ అందించేందుకు సహృదయంతో అగీకరించిన అన్నయ్య చిరంజీవికి కృతజ్ఞతలు. మీ నిస్వార్ధ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ కృష్ణ వంశీ ట్వీట్ చేశారు.

ఇక ఈమూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుపుకుంటోంది. ఇక రంగమార్తాండ సినిమాను డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular