Friday, March 20, 2026
HomeసినిమాChiranjeevi: చిరు, చరణ్‌ పిక్.. సోషల్ మీడియాలో వైరల్

Chiranjeevi: చిరు, చరణ్‌ పిక్.. సోషల్ మీడియాలో వైరల్

రామ్ చరణ్ కెరీర్ లో దూసుకు పోతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ ఒక్క సినిమాతోనే గ్లోబల్ స్టార్ అయ్యారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంతో చరణ్‌ ఇమేజ్ మరింత పెరిగింది.  వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు. అభిమానులకు పండగ రోజు. దీంతో అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు చరణ్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేశారు.

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియచేశారు. నిన్ను చూస్తే గర్వం గా ఉంది నాన్న, హ్యాపీ బర్త్ డే అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు మెగాస్టార్. విషెస్ తో పాటుగా ఒక బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేశారు. రామ్ చరణ్ ను ముద్దు పెడుతూ ఉన్న ఫోటో అది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీలో నటిస్తుంటే… చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీలో నటిస్తున్నారు.

Also Read : Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular