Wednesday, March 18, 2026
Homeసినిమాఫ్యాన్స్ కి స‌ర్ ఫ్రైజ్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

ఫ్యాన్స్ కి స‌ర్ ఫ్రైజ్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

Chiru with Power: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన  మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. ఈ సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భీమ్లా నాయ‌క్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేశారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల‌ను హైద‌రాబాద్ లో షూట్ చేశారు. అయితే.. భీమ్లా నాయ‌క్ షూటింగ్ జ‌రిగే ప్ర‌దేశంలోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీ షూటింగ్ కూడా జ‌రిగింది. ఆవిధంగా అన్న‌య్య చిరంజీవి, త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకే చోట క‌లిసి కాసేపు స‌ర‌దాగా మాట్లాడుకున్నారు. అదే స‌మ‌యంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయ‌ణ‌మూర్తి, పాన్ ఇండియా రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా అక్క‌డ ఉన్నారు.

వీళ్లంద‌రూ స‌ర‌దాగా మాట్లాడుకున్న‌ప్పుడు తీసిన‌ వీడియోను రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. చ‌ర‌ణ్ ఇచ్చిన స‌ర్ ఫ్రైజ్ కి తెగ సంబ‌ర‌ప‌డుతున్నారు మెగా అభిమానులు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular