Tuesday, March 10, 2026
Homeసినిమామారుతితో సినిమా చేయడానికి నేను రెడీ: మెగాస్టార్    

మారుతితో సినిమా చేయడానికి నేను రెడీ: మెగాస్టార్    

Anji-Maruthi: గోపీచంద్ – రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్‘ సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 – యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ  సినిమా, జులై 1వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి  హైదరాబాదు .. శిల్పకళా వేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ .. “మారుతి సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి తాను నాకు తెలుసు. ‘ప్రజారాజ్యం’ పార్టీ సమయంలో నేను చెప్పిన కాన్సెప్ట్ ను తను చాలా బాగా అర్థం చేసుకుని, నేను ఆశించిన అవుట్ పుట్ ఇచ్చాడు.

అప్పుడే నేను చెప్పాను .. ‘నీలో ఒక డైరెక్టర్ ఉన్నాడయ్యా ట్రై చెయ్’ అని. నేను అనుకున్నట్టుగానే తను డైరెక్టర్ అయ్యాడు .. అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. తను చేసిన ‘ప్రేమకథా చిత్రమ్’.. ‘భలే భలే మగాడివోయ్’ .. ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలు నేను చూశాను. తను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా సింపుల్ గా .. క్లారిటీతో చెప్పడం ఆయన ప్రత్యేకత. అలాంటి మారుతితో నన్ను సినిమా చేయమని యూవీ వారు అడుగుతున్నారు. మారుతిపై నాకు నమ్మకం ఉంది .. తను చేయగలడు. అందుకే వాళ్లకి నేను ఓకే చెప్పాను.

ఇక రావు రమేశ్ తో కలిసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. మేమిద్దరం ఇంతవరకూ కలవనేలేదు. రావు గోపాలరావు గారికి నేను అంటే ఎంతో ఇష్టం. సెట్లో  ఆయన తన ఇంటి నుంచి తెప్పించిన వంటకాలు ప్రేమతో నాతో తినిపించేవారు. అలాంటి ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రావు రమేశ్ టైమింగ్ కూడా నాకు బాగా నచ్చుతుంది.ఆయనతో కలిసి నటించాలని ఉంది. తాను ఇంకా చాలా గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్టేజ్ పై రావు గోపాలరావుని డైలాగ్ డెలెవిరీని చిరంజీవి ఇమిటేట్ చేయడం అక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా మార్చేసింది.

Also Read : ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular