Saturday, January 18, 2025
Homeసినిమాఇది మాకు నిజమైన పండగ : చిరంజీవి

ఇది మాకు నిజమైన పండగ : చిరంజీవి

Chiru is Happy As Sai Dharam Is Fully Recovered :

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆమధ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం.. కొన్ని రోజుల పాటు హాస్పటల్ లో చికిత్స తీసుకోవడం తెలిసిందే. అయితే.. సాయిధరమ్ తేజ్ హాస్పటల్ లో చేరిన తర్వాత ఒక పిక్ కూడా బయటకు రాలేదు. దీంతో తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. దీపావళి సందర్భంగా సాయితేజ్ పునః దర్శనం లభించింది. దీంతో మెగా ఫ్యామిలీలోనే కాకుండా మెగా ఫ్యాన్స్ లో కూడా ఈ దీపావళి ఆనందాన్ని తీసుకువచ్చింది.

దీపావళి సందర్భంగా మెగా హీరోలంతా ఒకచోట చేరి వేడుక చేసుకున్న ఫొటోను తాజాగా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. ‘అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ అని ఈ మెగా పిక్‌ని షేర్ చేశారు. ఇప్పుడీ మెగా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Must Read :అపస్మారక స్థితిలో సాయి ధరమ్ తేజ 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్