Wednesday, March 18, 2026
Homeసినిమాచిరు నెక్ట్స్ మూవీ రీమేక్?

చిరు నెక్ట్స్ మూవీ రీమేక్?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్‌ డైరెక్ట్ చేసిన  ఈ భారీ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. దీని తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా  ప్రకటించలేదు కానీ..  డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, చిరు బర్త్ డే ఆగష్టు 22న అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు.

అయితే.. ఈ సినిమా మలయాళంలో విజయం సాధించిన ‘బ్రో డాడీ’ కి రీమేక్ అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ తండ్రీ కొడుకులుగా నటించిన బ్రో డాడీ సినిమా సక్సెస్ సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయనున్నారని.. ఇందులో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించనున్నట్టుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత సిద్దు బిజీగా ఉండడంతో ఆ పాత్రను మరో యంగ్ హీరో శర్వానంద్ తో చేయించనున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. చిరంజీవి, కళ్యాణ్‌ కృష్ణతో చేసే సినిమా రీమేక్ కాదని.. ఓరిజినల్ స్టోరీ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర కథను రైటర్ బెజవాడ ప్రసన్న రాశారని.. ఈ కథ చిరంజీవి బాగా నచ్చిందని.. అందుకనే వెంటనే స్టార్ట్ చేయడానికి డేట్స్ ఇచ్చారు అంటున్నారు. దీంతో చిరు చేసేది రీమేకా..? ఓరిజినల్ స్టోరీనా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారు. అందుచేత ఈ సినిమాపై అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular