Wednesday, March 18, 2026
Homeసినిమాసత్య దేవ్ కు మెగా కృతజ్ఞతలు

సత్య దేవ్ కు మెగా కృతజ్ఞతలు

Thanks: మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్‘ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. ఈ చిత్రానికి చాలా ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా గాడ్‌ఫాదర్‌లో నటుడు సత్యదేవ్ కీలకమైన, పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.’ఆచార్య’ సినిమాలో తన ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..“అన్నయ్యా, నటనలో… జీవితంలో… మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది” అని ట్వీట్ చేశారు సత్యదేవ్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఓ ఫోటో గ్రాఫ్ ని అభిమానులతో పంచుకున్నారు.

దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ,..“డియర్ సత్యదేవ్ ..థ్యాంక్ యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. ఆచార్య లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..గాడ్ ఫాదర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless! ” అని రీట్వీట్ చేశారు మెగాస్టార్.

Also Read గౌత‌మ్ తో సినిమాపై చ‌ర‌ణ్‌ క్లారిటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular