Saturday, January 18, 2025
Homeసినిమామోహన్ బాబుకు మెగాస్టార్ వాయిస్

మోహన్ బాబుకు మెగాస్టార్ వాయిస్

“మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎప్పుడు ఎలాంటి థాట్ ని  ట్రిగ్గర్ చేస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్టూ చెప్పలేడు” అని చిరంజీవి అంటే,

“నేను చీకట్లో ఉండే వెలుతుర్ని, వెలుతురులో ఉండే చీకటిని” అని మోహన్ బాబు అంటే.. “వెరీ ఇంట్రస్టింగ్” అని చిరంజీవి అంటారు.

“నేను కసక్ అంటే మీరందరూ ఫసక్” అని మోహన్ బాబు అంటారు. శుక్రవారం విడుదలైన ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్లోని ఈ డైలాగ్స్ చిత్ర కథానాయకుడు మోహన్ బాబు పాత్ర ఎంత పవర్ఫుల్ గా  ఉంటుందో స్పష్టం చేస్తున్నాయి.

డా॥ మోహన్ బాబు కథానాయకుడిగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రం ‘సన్నాఫ్‌ ఇండియా’, డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ని శుక్రవారం హీరో సూర్య సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. “కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సార్ అంటే నాకెంతో గౌరవం.. సన్ ఆఫ్ ఇండియా టీజర్ విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది” అని సూర్య అన్నారు. డైలాగ్ కింగ్ నటించిన ఈ చిత్రంలోని ఆయన పాత్ర పరిచయానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… “నేను SON OF INDIA అనే చిత్రాన్ని తీస్తున్నానని నా అభిమానులకి, ప్రేక్షకులకి తెలుసు.. SON OF INDIA చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. విష్ణు వెంటనే చిరంజీవి అంకుల్ వాయిస్ బావుంటుందన్నాడు. చిరంజీవికి ఫోన్ చేసి అడిగాను. ఎన్నిరోజుల్లో కావాలి బాబు అన్నాడు. పది రోజుల్లో ఎప్పుడైనా ఓకే అన్నాను. ఆ వాయిస్ ఓవర్ మ్యాటర్ నాకు పంపు అన్నాడు.. పంపాను. ఆచార్య షూటింగ్ బిజీగా వున్న చిరంజీవి నేను అడిగిన మూడు రోజుల్లోనే నాకు చెప్పకుండా తనే థియేటర్ బుక్ చేసి తనే డబ్బింగ్ చెప్పి పంపాలనుకున్నాడు. ఆ మ్యాటర్ నాకు తెల్సింది డబ్బింగ్ థియేటర్ కి విష్ణుని పంపాను.. విష్ణు బాబుని చూడగానే చిరంజీవి నవ్వుతూ నిన్ను ఎవరు రమ్మన్నారు.. డబ్ చేసి మీ నాన్నకి సరైజ్ ఇద్దామనుకున్నాను అన్నాడు. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది, నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకి, అతని సహృదయతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో ‘సన్నాఫ్ ఇండియా’ కు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్  తో మీ ముందుకి వస్తాము” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్