Sunday, January 19, 2025
Homeసినిమామ‌ళ్లీ పాన్ ఇండియా ప్లాన్ లో మెగాస్టార్?

మ‌ళ్లీ పాన్ ఇండియా ప్లాన్ లో మెగాస్టార్?

ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ట్రెండ్ న‌డుస్తుంది. స్టార్ హీరోలే కాకుండా యంగ్ హీరోలు సైతం త‌మ సినిమాల‌ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. సీనియ‌ర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి అంటూ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేశారు. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ న‌టించ‌డం విశేషం. అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇప్పుడు మెగాస్టార్ మళ్లీ పాన్ ఇండియా పై గురిపెట్టడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.  చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాద‌ర్ అనే సినిమా చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు అఫియ‌ల్ తెలుగు రీమేక్. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న గాడ్ ఫాదర్ చిత్రాన్ని విజయదశమి రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం గాడ్ ఫాద‌ర్ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మలయాళం మినహా మిగిలిన ప్రధాన భారతీయ భాషలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు కాబట్టి.. ముఖ్యంగా హిందీ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నార‌ని తెలిసింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా కాదా అనేది తెలియాల్సివుంది.

Also Read : యాక్షన్ షూటింగ్ లో గాడ్ ఫాద‌ర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్