Thursday, March 12, 2026
Homeసినిమావ‌రుణ్ తేజ్ ని అభినందించిన మెగాస్టార్

వ‌రుణ్ తేజ్ ని అభినందించిన మెగాస్టార్

Chiru wishes to Varun:
మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం ‘గ‌ని’. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హించారు. భారీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్నారు.

ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 3న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. డిసెంబ‌ర్ 24కి వాయిదా ప‌డింది. ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ట్రాన్స్ ఫామ్ అయిన విధానం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ వరుణ్.. ఒక పాత్ర కోసం నువ్వు చేసిన హార్డ్ వర్క్ మరియు ప్యాషన్ ఏంటి అనేది తెలుస్తుంది’ అని చిరంజీవి అభినందించారు. అలాగే వ‌రుణ్ తేజ్ కి అలాగే చిత్ర యూనిట్ అంద‌రికీ ఈ సినిమా విజ‌యం సాధించాలని కోరుకుంటూ విషెస్ అంద‌జేశారు.

Also Read :   ‘గని’కి చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular