Sunday, September 8, 2024
HomeTrending Newsనారాయణ బెయిల్ రద్దు

నారాయణ బెయిల్ రద్దు

టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో మాజీ మంత్రి పి. నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. నవంబర్ 30వ తేదీలోగా ఆయన లొంగిపోవాలని ఆదేశించింది. గత ఏడాది టెన్త్ ప్రశ్నాపత్రాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లీక్ అయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ప్రభుత్వం నారాయణ విద్యా సంస్థలపై కేసు నమోదు చేసి మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లో అరెస్టు చేసింది. ఆయన్ను చిత్తూరు తరలించారు, అయితే ఈ కేసులో నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసుపై  జిల్లా కోర్టులో నేడు జరిగిన వాదనల్లో నారాయణ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై జడ్జి తాజా ఉత్తర్వులు ఇస్తూ లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్