Saturday, January 18, 2025
Homeసినిమా'విక్రమ్'లో ఏజెంట్ టీనాను ఎవరు మర్చిపోగలరు?!

‘విక్రమ్’లో ఏజెంట్ టీనాను ఎవరు మర్చిపోగలరు?!

Vasanthi: కమల్ కథానాయకుడిగా రూపొందిన ‘విక్రమ్‘ సినిమా, ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ సొంత సంస్థలో నిర్మితమైన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాగే ప్రత్యేకమైన పాత్రలో సూర్య కనిపించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గానీ .. డ్యూయెట్లు గాని ఉండవు. అయినా ఆడియన్స్ కి కథ కనెక్ట్ అయిపోయింది. ఒక చిన్నపిల్లాడి చుట్టూ అల్లుకున్న ఎమోషన్ తో భారీ యాక్షన్ నడుస్తుంది. విడుదలైన  ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేస్తూ వెళుతోంది.

ఈ సినిమాలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రతి పాత్రను పరిచయం చేసిన తీరు కొత్తగా ఉంటుంది. ఆ పాత్రలను ఆయన మలిచిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కమల్ .. సూర్య .. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ పాత్రలను మాత్రమే కాదు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే పాత్ర ఒకటుంది .. ఆ పాత్ర పేరే ‘ఏజెంట్ టీనా’. ఈ సినిమాలో విక్రమ్ కి ఒక కోడలు .. మనవడు ఉంటారు. కొడుకు చనిపోయిన తరువాత ఆ కుటుంబాన్ని విక్రమ్ కాపాడుకుంటూ ఉంటాడు. అయితే ఆయనపై కోడలికి సరైన అభిప్రాయం ఉండదు.

ఆ ఇంట్లో విక్రమ్ కోడలు .. ఆమె కొడుకు పనులను ఒక పనిమనిషి దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. చాలా సాధారణమైన లుక్ తో ఆమె తన పనులను చేసుకుని వెళుతుంటుంది. ఒకానొక సమయంలో పోలీసులు ఆమెను కూడా విచారణ చేస్తారు. విక్రమ్ లేని  సమయంలో విలన్ గ్యాంగ్ ఆ ఇంటిపై దాడి చేస్తుంది. విలన్ మనుషులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో .. అప్పుడు ఆ పనిమనిషిలోని ‘ఏజెంట్ టీనా’ బయటికి వస్తుంది. ఆమె చేసిన ఫైట్స్ కు ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడతాయి. ఆ పాత్రలో అంత బాగా ఫైట్స్ చేసిన ఆమె డాన్స్ కొరియోగ్రఫర్ అనే విషయం తెలిస్తే మరోసారి ఆశ్చర్యపోతారు. కోలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న ఆమె పేరు ‘వాసంతి’ .. ఈ సినిమాతోనే నటిగా  పరిచయమైంది. తన పాత్రకి దక్కుతున్న గుర్తింపు పట్ల ఆమె హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.

Also Read : ‘విక్రమ్’లో యాక్షన్ ఓకే .. ఎమోషనే కనెక్ట్ కాలేదు! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్