భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసియార్ రేపు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.
యాదగిరిగుట్ట ఆలయ పుర్నర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీడ దినాలు అయిపోయిన తరువాత మే నెలలో ఆలయాన్ని పున:ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన జస్టిస్ రమణకు రాజ్ భవన్ లో నిన్న ఘన స్వాగతం లభించింది. గవర్నర్, కేసియార్, రాష్ట్రమంత్రులు ప్రధాన న్యాయమూర్తికి సాదర స్వాగతం పలికారు. మూడు రోజులపాటు అయన రాజ్ భవన్ అతిథి గృహంలో గడపనున్నారు.ముఖ్యమంత్రి కెసియార్ నిన్న రాజ్ భవన్ లో రమణతో కాసేపు భేటి అయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి గుట్ట ఆలయాన్ని సందర్శించాలని కెసియార్ కోరినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన రమణ రేపు యాదగిరి గుట్ట వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ప్రముఖులు రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు. జిల్లా యంత్రాంగం ఈ పర్యటనకు సన్నద్ధమవుతోంది. పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.