యువ గళం పాదయాత్రలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేస్తోన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కావలి ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణ చేశారు. డ్రెయిన్ ఆక్రమించారంటూ సేల్ఫీ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
” రాష్ట్రంలో వైసిపి దొంగలు కబ్జాకు కాదేది అనర్హమంటూ యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారు. ఇది కావలి నియోజకవర్గం ఆములదిన్నె బిట్-2 పరిధిలో రోడ్డు వెంట ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు కాటా శ్రీనివాసరెడ్డి కొండపి డ్రెయిన్ ను పూడ్చేసి వేసిన లే అవుట్. రోడ్డును ఆనుకొని 15ఎకరాల డ్రెయిన్ ను ఆక్రమించడమేగాక 5 తూములను కూడా పూడ్చేశారు. ఫలితంగా రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఎవరు ఏమైపోయినా ఫర్వాలేదు, తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండాలన్న జగన్ రెడ్డి గారి సిద్ధాంతాన్నే ఆయన సామంతరాజులు ఫాలో అవుతున్నారు. తమకు లైవ్ లో నరకం చూపిస్తున్న జె-గ్యాంగ్ కు చుక్కలు చూపించేందుకు జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు”