Monday, January 20, 2025
HomeTrending NewsYS Jagan: పేదల కడుపు కొడుతున్నారు: సిఎం వ్యాఖ్యలు

YS Jagan: పేదల కడుపు కొడుతున్నారు: సిఎం వ్యాఖ్యలు

ఇళ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చే అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని భూములను సేకరించాలని, కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణాశాఖపై తాడేపల్లిలోని  క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలని,  కోర్టు కేసుల కారణంగా ఇళ్లస్థలాల పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని సిఎం సూచించారు.  విశాఖలో ఇళ్ల నిర్మాణం డిసెంబరులోగా పూర్తికావాలని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని,  రూఫ్‌ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని అధికారులు సిఎంకు వివరించారు.  కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలని సిఎం చెప్పారు.

సీఆర్‌డీఏ పరిధిలో 45,101 మంది ఆప్షన్‌–3 ఎంపిక చేసుకున్నారని. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక కూడా పూర్తయిందని, అందరితోనూ బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఆర్‌డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు, కోర్టు విచారణలో అంశాన్ని ప్రస్తావించిన అధికారులు.

పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని, పేదల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారని సిఎం వ్యాఖ్యానించారు. అక్కడ ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచనగా ఉందని, అయితే గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని, నికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలమని సిఎం ఉద్బోధించారు,

టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని సిఎం అన్నానారు. వందల, వేల సంఖ్యలో గృహాలు ఈ కాలనీల్లో ఉంటున్నందున వారి అవసరాలను తీర్చేలా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్‌  ఇచ్చారు. అలాగే టిడ్కో గృహాలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకూ సిఎం అనుమతి మంజూరు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్