Sunday, January 19, 2025
HomeTrending Newsమూడో వేవ్ పై అప్రమత్తం: సిఎం జగన్

మూడో వేవ్ పై అప్రమత్తం: సిఎం జగన్

Be Alert: కోవిడ్‌ మూడో వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓమిక్రాన్ కేసులు…కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం సూచనలు:

⦿ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా మూడో వేవ్ కు సన్నద్ధంగా ఉండాలి

⦿ వ్యాక్సినేషన్‌ ఉధృతంగా చేయాలి, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి

⦿ ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే గుర్తించి వెంటనే ఇవ్వాలి

⦿ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, వృద్ధులకు బూస్టర్‌డోస్‌లో ప్రాముఖ్యత ఇవ్వాలి

⦿ కోవిడ్‌ నివారణ, నియంత్రణ, తాజా కేసులుపై సీఎంకు నివేదిక అందించిన అధికారులు.

⦿ రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని, వీరిలో ఎవ్వరూ ఆస్పత్రిపాలు కాలేదన్న అధికారులు

⦿ అధికారులు ఇచ్చిన వివరాలు ప్రకారం భయాందోళన అవసరంలేదన్న సిఎం

⦿ అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన

ఓమిక్రాన్ పై సిఎం సూచనలు

⦿ రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలి

⦿ డేటాను పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి

⦿ విదేశాలనుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని ట్రేస్‌ చేయాలి

⦿ ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలి

⦿ పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌ కు కూడా వెంటనే పరీక్షలు చేయాలి ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్‌(నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Also Read : 53,54 జీవోలు చెల్లవు: హైకోర్టు

RELATED ARTICLES

Most Popular

న్యూస్