వివిధ కారణాలతో పథకాలు అందని లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా సంక్షేమం అందిస్తున్నామని, ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందని తెలియజెప్పడాని ఇదే సంకేతమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోకపోయినా, దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు వల్లనో, కావల్సిన పత్రాలు ఇవ్వని పరిస్థితుల్లో కానీ, ఆధార్‌తో మిస్‌మ్యాచ్ వంటి ఇతరత్రా కారణాల వల్ల.. ఆరు నెలల్లో ఆయా పథకాలు రాని పరిస్థితి ఉంటే.. ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని వివరించారు.
ఆగష్టు, 2023 నుంచి డిసెంబరు, 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది అందని 68,990 మంది అర్హులకు, రూ.97.76 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్.
“నా దగ్గర నుంచి మొదలుపెడితే.. కలెక్టర్లు, అక్కడ నుంచి సచివాలయస్ధాయి వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమం. ఎవరికైనా, ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని పరిష్కరించడం కోసం వాళ్ల తరపున మంచి సేవకుడిగా ఉందన్న భరోసా కల్పించే కార్యక్రమం ఇది” అంటూ వ్యాఖ్యానించారు.
అమ్మఒడి ఇప్పటికే 42.62 లక్షల మందికి ఇస్తున్నామని; నేడు మరో 40,616 మందికి
జగనన్న చేదోడు ద్వారా 3.25లక్షల మందికి ఇస్తుంటే నేడు మరో 15వేల మందికి
ఈబీసీ నేస్తం కింద 4.40 లక్షల మందికి మంచి జరగ్గా.. ఇప్పుడు మరో 4,180 మందికి
వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా అప్పట్లో 2.80లక్షల మందికి; ఇప్పుడు మరో 3,030 మందికి మత్స్యకారభరోసా ద్వారా అప్పుడు 1.20లక్షల మందికి ; ఇవాళ మరో 2వేల మందికి
కళ్యాణమస్తు– షాదీతోపా ద్వారా అప్పట్లో 29,934 మందికి; నేడు మరో 1,912 మందికి
వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.60 లక్షల మందికి; నేడు మరో 1,884 మందికి
నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి; నేడు మరో 352 మందికి మంచి చేస్తున్నామని వివరించారు.