భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారి చిత్ర పటాలకు పూలు సమర్పించి నివాళులర్పించారు జగన్.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
Also Read : ఎఫ్‌ఏఓతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం