Sunday, November 24, 2024
HomeTrending NewsCM Jagan: ఎన్నికల్లోపే నిర్వాసితులకు న్యాయం: సిఎం

CM Jagan: ఎన్నికల్లోపే నిర్వాసితులకు న్యాయం: సిఎం

పోలవరం నిర్వాసితులకు కేంద్రం నేరుగా సహాయం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోడీకి కూడా తాను తెలియజేశానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తామే చెయ్యాలని ఆరాట పడటం లేదని, ప్రజలకు మంచి జరగాలని తాపత్రయ పడుతున్నామని వ్యాఖ్యానించారు. “క్రెడిట్‌ ఎవరికి వచ్చినా పర్వాలేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా” అని నిర్వాసితులతో అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల ప్యాకేజీకి తోడు 3.9 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము ఇస్తామని, దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా అల్లూరి జిల్లా కూనవరంలో బాధితులతో  పాటు పోలవరం నిర్వాసితులతో సిఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.

సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయి.
  • మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌ గారికి వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
  • ధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజులుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పాం.
  • వరద వచ్చినా ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందించే కార్యక్రమాన్ని చూస్తున్నాం.
  • వారం రోజుల్లో వాళ్లంతా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇంటినీ మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికీ సహాయం అందించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతకు ముందూ ఇదే చేశాం. ఇప్పుడూ చేస్తున్నాం.
  • వారం రోజుల తర్వాత నేను వస్తాను, గ్రామాల్లో తిరిగినప్పుడు మాకు రావాల్సిన సాయం అందలేదనే మాట ఎవరైనా అంటే అది బాగుండదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
  • సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్‌ వ్యవస్థ దాకా యాక్టివేట్‌ చేసి ఏ ఒక్కరూ సాయం అందకుండా
  • పేదవాడికి ఎటువంటి వ్యత్యాసం చూపించవద్దని, పూర్తిగా ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం.
  • ఎన్యుమరేషన్‌ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే.
  • ప్రతి అడుగులోనూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. అందరికీ మేలు జరగాలని పెట్టాం.
  • పొరపాటున నష్టం జరిగి ఉండి జాబితాలో పేరు లేకపోతే వెంటనే జాబితాలోకి పేరు చేర్చి మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్‌ మీ దగ్గరకు వచ్చాడు.
  • ఈ ప్రాంతానికి జనరల్‌ ఇష్యూ ఉంది. పోలవరం ప్యాకేజీకి సంబంధించింది. ఇంతకు ముందు కూడా మీ అందరికీ ఇదే చెప్పాం.
  • మీ జగన్‌లో కల్మషం లేదు. మీ జగన్‌ ఎప్పుడైనా మంచి చేయడం కోసమే ఆరాటం, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా.
  • లాస్ట్‌ టైమ్‌ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 41.05లో కాంటూర్‌లెవల్‌లో మావి లేనప్పటికీ కటాఫ్‌ అయిపోయిన గ్రామాల్లో మేము ఉండిపోతాం. అని చెప్పడం జరిగింది.
  • అటువంటి గ్రామాలకు మంచి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత సర్వే చేయించాం.
  • 32 గ్రామాలు 48 హ్యాబిటేషన్లను 41.15 దాకా మొదటి స్టేజ్‌ కింద నిలబెట్టినా కూడా ఆ మొదటి దఫా నిలబెట్టినప్పుడు కూడా కటాఫ్‌ అయిపోయిన గ్రామాల్లోకి నీళ్లు నిలబడటం వల్ల మరో 48 గ్రామాలు చేరుతాయి.
  • ఈ గ్రామాలకు వెళ్లడానికి దారి ఉండదు కాబట్టి వాటిని చేర్చాలని సర్వే చేయించి, దాని ద్వారా ఇందులోకి సైంటిఫిక్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఆయా గ్రామాలను తీసుకొచ్చాం. ఆ గ్రామాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపాం.
  • 41.15 మీటర్ల దాకా నీళ్లు నింపాలంటే 3 దఫాలుగా నింపాలి. ఒకటే స్టేజీలో నింపితే లీకేజీ అవుతుందనే ఉద్దేశంతో 3 ఫేజుల్లో నింపాలి.
  • మూడు సంవత్సరాల్లో3 ఫేజుల్లో డ్యామ్‌ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. డ్యామ్‌ కట్టిన తర్వాత నీళ్లు నింపేది 41.15కు నింపుతారు.
  • కాంటూర్‌ లెవల్‌లో వచ్చే ప్రతి నిర్వాసిత కుటుంబాలకు కూడా వాళ్లందరికీ ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇచ్చి, అందరికీ న్యాయం చేయడం జరుగుతుంది.
  • నిర్వాసితులను చూసుకోవంతో పాటు సర్వే ద్వారా 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్లు కూడా ఫస్ట్‌ ఫేజ్‌లోకి తీసుకురావడం జరుగుతోంది.
  • దాని వల్ల 41.15 మీటర్లకు సంబంధించి ఎవరెవరికి ఏమేం రావాలో ఫస్ట్‌ ఫేజ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది.
  • మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే లిడార్‌ సర్వే పూర్తి చేశాం. కేంద్రానికి పంపి ఒప్పించడం జరిగాయి.
  • దేవుడి దయతో ఈ నెలాఖరుకల్లా కేబినెట్‌ దాకా పోయే కార్యక్రమం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్లు సంతకాలు పెట్టడం జరిగింది.
  • సీడబ్ల్యూసీ వాళ్లకు చేరింది. మరో వారం దాటేలోపు కేంద్ర జలశక్తి శాఖ క్లియర్‌ చేసి పంపుతారు.
  • ఆర్‌అండ్‌ ఆర్‌ కింద ఇవ్వాల్సినవన్నీ జరిగిపోతాయి. లిడార్‌ సర్వేలో వచ్చిన 48 హేబిటేషన్ష్‌ కూడా కవర్‌ అవుతాయి.
  • ఇక్కడి ప్రజలు సంతోష పడాలంటే ఇదొక్కటి జరిగించాలి.
  • దేవుడు ఆశీర్వదిస్తే కేంద్రం నుంచి జరగాల్సిన మంచి జరుగుతుందని, ఎన్నికలకు వెళ్లేలోపు కేంద్రం ఇవ్వాల్సినవి, రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినవి వచ్చే ఆరేడు నెలల్లో అందరికీ మంచి జరుగుతుందని నమ్మకం ఉంది.
  • పోలవరానికి సంబంధించిన ఈ విషయాలన్నీ ఈ పద్ధతిలో జరిగిపోతాయి.
  • ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది? కలెక్టర్‌ ఏ విధంగా చేయించాడు.
  • కూనవరం ఎస్‌ఐ వెంకటేశ్‌ గురించి మంచి వార్త విన్నా. గొప్పగా ఆదుకున్నాడు, నిలబడ్డాడని విన్నా.
  • కలెక్టర్‌ గారికి చెప్పా ఆగస్టు 15న ఇచ్చే మెడల్స్‌లో ఆయన పేరు ఉండాలని సూచించా.
  • నేను అధికారులను నిలదీయడానికి రాలేదు. అధికారులకు శభాష్‌ అని చెప్పి, వెన్ను తట్టి బాగా చేశాడు అని చెప్పడం కోసం, మీ దగ్గర నుంచి ఆ రకంగా మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా.
  • ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అధికారులు, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు.
  • ఏదైనా పరిష్కరించడం కోసమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
  • పోలవరం ప్రాజెక్టు మొదట్లో నాన్నగారి హయాంలో ల్యాండ్‌ అక్విజేషన్‌ జరిగినప్పుడు లక్ష, లక్షన్నరకు కొనుగోలు చేశారు. దాన్ని నేను 5 లక్షలు ఇస్తానని చెప్పాను. ఆ మిగిలిన 3.5 లక్షలు కూడా కచ్చితంగా ఇచ్చేస్తాం.
  • మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదని చెబుతున్నా.
  • మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ మీ బిడ్డ చేయడని గుర్తు పెట్టుకోండి
RELATED ARTICLES

Most Popular

న్యూస్