Saturday, March 14, 2026
HomeTrending NewsYS Jagan: సిఎం అనంతపురం పర్యటన 26కు వాయిదా

YS Jagan: సిఎం అనంతపురం పర్యటన 26కు వాయిదా

రేపు సోమవారం అనంతపురం జిల్లాలో జరగాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన 26కు వాయిదా పడింది.  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో సిఎం జగన్ పర్యటించి అక్కడ జరిగే బహిరంగసభలో ‘జగనన్న వసతి దీవెన కార్యక్రమం’ కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో సిఎం టూర్ వాయిదా పదినట్లు సీఎంఓ అధికారులు ప్రకటించారు.

కాగా, రంజాన్ సందర్భంగా రేపు విజయవాడ వన్‌ టౌన్‌ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.45 గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియంకు చేరుకుంటారు. 5.45 – 7.15 గంటల వరకు ఇఫ్తార్‌ విందులో పాల్గొని అనంతరం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular