కోవిడ్ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నియామకాలు యకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నవంబర్ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే వారి కుటుంబాల్లో అర్హులైనవారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలిస్తారు. కొవిడ్‌తో చనిపోయినా అదే నిబంధన వర్తింపజేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు ప్రభుత్వానికి చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి దీనిపై తగు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాల వారీగా కలెక్టర్లు బాధ్యతా తీసుకొని కోవిడ్ తో మరణించిన ఉద్యోగుల జాబితాను తయారు చేసి, ఆయా కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత ఉన్నవారి జాబితాను తయారు చేయనున్నారు.