Alternative Crops:
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగించాలని, అవి సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా చూడాలని నిర్దేశించారు. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు….
వరి పండిస్తే వచ్చే ఆదాయం… మిల్లెట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి
⦿ దీనికోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి
⦿ ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి
⦿ మిల్లెట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి
⦿ మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి
⦿ దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి
⦿ సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలి
⦿ రసాయన ఎరువులు, పురుగుమందుల స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలి
⦿ రసాయనాలు లేని సాగుమీద మంచి విధానాలను తీసుకురండి
⦿ ఆర్బీకే యూనిట్‌గా ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి
⦿ ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున్న సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలి
⦿ సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి
⦿ ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్‌కూడా ఇచ్చేలా వ్యవస్థ రావాలి
అంటూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Also Read : మేనేజ్మెంట్ పాఠం