Saturday, January 18, 2025
HomeTrending Newsమన తపన ప్రజల్లోకి తీసుకెళ్ళండి : జగన్

మన తపన ప్రజల్లోకి తీసుకెళ్ళండి : జగన్

CM Jagan asked Officials to get Awareness to Public on New Education Policy :

నూతన విద్యావిధానంలో  ఏ ఒక్క స్కూల్‌ ను కూడా మూసివేయడం లేదని, ఒక్క ఉపాద్యాయుడ్ని కూడా తీసేయడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంగ్లీషు మీడియంలో చెప్పాలని ఆరాటపడుతున్నామని, పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నామని వెల్లడించారు, అంతిమంగా అదే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడు కార్యక్రంపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి, ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్ధను తీర్చిదిద్దుతున్నామని, ఇదే విషయాన్ని గట్టిగా ప్రజలకు వివరించాలని సూచించారు.  నూతన విద్యావిధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించాలని సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సందేహాలు వ్యక్తంచేస్తే అధికారులు వారికి తగిన సమయం కేటాయించి వారి సందేహాలు తీర్చాలని ఆదేశించారు.

స్కూళ్లు,అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదని విస్పష్టంగా వెల్లడించారు జగన్.  ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే మనం మార్పులు చేస్తున్నామన్నారు.

రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యమని,  పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు మొదటిది అవుతుందని, వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుందన్నారు. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌ పరిధిలోకి తీసుకురావాలని, ఈ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలని అధికారులకు ఉద్భోదించారు.

Awareness to Public on New Education Policy :

వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో గత రెండేళ్లుగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నామని, ఐదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు రంగాల్లో మనం చేసిన ప్రగతి కనిపించాలన్నారు.

జులై 1 నుంచి రెండో విడత నాడు– నేడు ప్రారంభిస్తున్నట్లు అధికారులు సిఎం జగన్ కు చెప్పారు, స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమంపై తెలంగాణ అధికారులు సంప్రదించారని తెలిపారు. తెలుగువారు ఎక్కడున్నా వారికి మంచి జరగాలని సిఎం ఆకాంక్షించారు. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న డిక్షనరీని అధికారులు సిఎంకు చూపించారు.

Also Read : ఏపి ప్రయోజనాలే జగన్ లక్ష్యం : సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్