Sunday, February 23, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కరోనా సంక్షోభంలోను సంక్షేమం : సజ్జల

కరోనా సంక్షోభంలోను సంక్షేమం : సజ్జల

సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరూపించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ నేటి పరిపాలన, నాటి బాబు పాలనకు తేడాను రెండేళ్ళలోనే ప్రజలు గమనిచారని, ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి ప్రతిక్షణం విలువైనదేనని జగన్ భావిస్తూ వచ్చారని సజ్జల వెల్లడించారు.

నాడు వైఎస్సార్ ఐదేళ్ళ పాలనలో…. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఆయనకున్న పరిమితులకు లోబడి కూడా వివిధ రంగాలపై చెరగని ముద్ర వేశారని, ఆ మహానేత చూపిన బాటలో, వేసిన పునాదులపై నేడు జగన్ మోహన్ రెడ్డి అంతకు పదింతల వేగంతో చేయగలుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు.
దృఢ నిశ్చయంతో, అకుంఠిత దీక్షతో జగన్ పాలన సాగుతున్న తీరు చూస్తుంటే ఇలాంటి నాయకులు యుగానికొక్కరు వస్తారేమో అన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. గడప వద్దకు పాలన, ప్రజల వద్దకు పాలన గురించి సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నామని కానీ వాస్తవంగా గడప వద్దకు కాకుండా… వాలంటీర్లు, సచివాలయాల ద్వారా ఇంట్లోకే సంక్షేమ పాలన అందించిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు సజ్జల.

గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన ఆర్ధిక భారం ఒకవైపు, కరోనా సంక్షోభంతో ఏర్పడ్డ భారం ఇంకోవైపు ఉన్నా… దాన్ని తట్టుకుంటూనే సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని సజ్జల వివరించారు. రెండేళ్ళ జగన్ పాలనలో అవినీతికి, స్కాములకు ఆస్కారం లేదన్నారు. 20 ఏళ్ళ అభివృద్ధిని జగన్ రెండేళ్లలో చేసి చూపించారని వివరించారు.

తెలుగుదేశం పార్టీ రెండేళ్లుగా ప్రజల విశ్వాసాన్ని మరింతగా కోల్పోయిందని… ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ విషయం మరింత తేటతెల్లమైందని సజ్జల అన్నారు. మహానాడులో చేసిన తీర్మానాలు చూస్తె నవ్వోస్తోందని….. కుల రాజకీయాలపై మహానాడులో చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్