Sunday, January 19, 2025
HomeTrending NewsYS Jagan: నెలరోజులపాటు జగనన్న సురక్షా కార్యక్రమం: సిఎం

YS Jagan: నెలరోజులపాటు జగనన్న సురక్షా కార్యక్రమం: సిఎం

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో గ్రామ సచివాలయాల దగ్గరనుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా ప్రత్యేక శ్రద్ధపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో క్వాలిటీ కూడా ఎంతో ముఖ్యమని ఉద్భోదించారు. జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం– సాగునీరు విడుల, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేస్తూ…

  • ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే… ప్రభుత్వానికి ఇది ఎంత ప్రాధాన్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
  • తంలో పరిష్కారం లభించని వినతులను కూడా సమర్ధవంతంగా మరింత నాణ్యతతో పరిష్కరించాలి, సగటు మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి.
  • నాణ్యతతో పరిష్కరించాల్సిన బాధ్యత అందరి భుజస్కంధాలపై ఉంది.
  • నిర్దేశించుకున్న సమయంలోగా వినతులను పరిష్కరించడం కూడా ముఖ్యం.
  • ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాం.
  • సమర్థవంతంగా, ప్రభావవంతంగా సమస్యలను పరిష్కరించడం అన్నది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ప్రారంభించి నెల రోజులు గడిచింది.
  • 1902 టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశాం. 30 ప్రభుత్వశాఖలు, 102 హెచ్‌ఓడీలతో పాటు  రెండు లక్షల మంది ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టింది.
  • సీఎంఓ, సచివాలయం, విభాగాధిపతులు దగ్గరనుంచి, జిల్లాలు, మండల స్థాయిల్లో కూడా ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు పెట్టాం. ఇప్పటివరకూ వచ్చిన వినతులు 59,986. వీటిలో నిర్దేశిత సమయంలోగా 39,585 వినతలు పరిష్కరించాం.
  • మరో 20,045 వినతులు నిర్దేశిత సమయంలో పరిష్కారం దిశగా ప్రగతిలో ఉన్నాయి.
  • 99.35 శాతం వినతులు పరిష్కారమయ్యాయి.  వినతులుపరిష్కరించే తీరు బాగున్నా సంతృప్తికర స్థాయి పెరగాల్సి ఉంది.
  • ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం.
  • జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షా కార్యక్రమం.
  • ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సచివాలయాల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి వివరిస్తారు.

  • ఇంటికి సంబంధించి ఏ రకమైన వినతి అయినా..  ఏదైనా పత్రాలకు సంబంధించి కానీ, డెత్, ఇన్‌కం, మ్యారేజీ సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై జల్లెడపడతారు.
  • ఒక్కరు కూడా సచివాలయంలో మిస్‌ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి.
  • మండల స్ధాయిలో ఎంపిడీఓ, డిప్యూటీ తహశీల్దార్‌ ఒక టీం, తహశీల్దార్, ఈవో పంచాయతీరాజ్‌ కలిసి రెండు టీమ్‌లుగా ఏర్పడతాయి. ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి.
  • సచివాలయానికి వస్తున్న తేదీ వివరాలను ముందే నిర్ణయించి, ఆ రోజు నాటికి గ్రామంలో ఉన్న క్షేత్రస్ధాయి సిబ్బంది  ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.
  •  జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారు.
  •  అర్హత ఉన్నవారు ఎవ్వరూకూడా మిస్‌ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి.
  •  26 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారులంతా ఆయా ప్రాంతాల్లో  నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.

గడప గడపకూ మన ప్రభుత్వం;  ఎన్‌ఆర్‌ఈజీఎస్‌;  జగనన్న హౌసింగ్‌;  టిడ్కో ఇళ్లు; ఖరీఫ్‌కు సన్నద్ధత;  ఖరీప్‌ 2023  ఇ– క్రాప్‌ బుకింగ్‌;  జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష;  జగనన్న విద్యాకానుక కారక్రమాలపై కూడా సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్