Sunday, January 19, 2025
HomeTrending Newsప్రికాషన్ డోస్‌ గడువు తగ్గించాలి: సిఎం జగన్

ప్రికాషన్ డోస్‌ గడువు తగ్గించాలి: సిఎం జగన్

Precaution Dose: కోవిడ్ ప్రికాషన్‌ డోస్‌ వేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న 9 నెలల వ్యవధిని 6 నెలలకు కుదించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు.  దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఉపయోగమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి లోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రికాషన్ డోస్ తో చాలామందిని కోవిడ్‌నుంచి ఆస్పత్రిపాలు కాకుండా రక్షించే అవకాశం ఉంటుందని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.  రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో వెనకబడి ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సిఎం ఆదేశించారు.

కోవిడ్‌ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్‌ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని సిఎంకు అధికారులు వివరించారు. కోవిడ్‌ పాజిటివ్‌ తేలినవారి కాంటాక్ట్స్‌ లో కేవలం హైరిస్క్‌ ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ స్పష్టంచేసిందని తెలిపారు.

కోవిడ్‌ నివారణా చర్యలు, వ్యాక్సినేషన్‌పై అధికారుల వివరాలు:

⦿ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
⦿ రెండో వేవ్‌తో పోల్చిచూస్తే… ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచాం
⦿ అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయి
⦿ దాదాపు 27వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
⦿ ఇందులో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమే
⦿ గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేది
⦿ ఇప్పుడు వారంరోజులకు ముందే డిశ్చార్జి అవుతున్నారు
⦿ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను గుర్తించాం
⦿ సుమారు 28వేల బెడ్లను సిద్ధంచేశాం…

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : లోకేష్ కు కోవిడ్: స్కూళ్ళపై సిఎంకు లేఖ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్