Sunday, March 15, 2026
HomeTrending Newsసంక్రాంతి వేడుకల్లో సిఎం జగన్ దంపతులు

సంక్రాంతి వేడుకల్లో సిఎం జగన్ దంపతులు

తాదేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

క్యాంప్‌ కార్యాలయం ఆవరణలోని గోశాల వద్ద వైభవంగా…  గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఈ సంబరాలు జరిగాయి.  వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్టింగ్ అందరినీ ఆకర్షించింది.  అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం  పలికారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా వేడుకలు జరిగాయి.

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular