Sunday, January 19, 2025
HomeTrending Newsనెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి పేరు: సిఎం జగన్

నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి పేరు: సిఎం జగన్

పెన్నా నది మధ్యలో  సబ్ మెర్సిబుల్ కాజ్ వే నిర్మాణానికి 93 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే ప్రారంభించిన నెల్లూరు బ్యారేజ్ కు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆయన తండ్రి, దివంగత మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.  కృష్ణపట్నం ప్రాంతంలోని మత్స్యకారులకు 25 కోట్ల రూపాయలతో ప్రత్యేక జెట్టీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో ఏపీ జెన్కో నిర్మించిన 800 మెగావాట్ల ప్లాంటును సిఎం జగన్ జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ అవసరాలలో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో ద్వారానే ఉత్పత్తి అవుతోందన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టుకున్న ఈ విద్యుత్ ప్రాజెక్టుకు  దివంగత నేత 2008లో శంఖుస్థాన చేశారని, దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి నాడు శ్రీకారం చుడితే ఇప్పుడు పూర్తి స్థాయి ప్లాంట్ ను ప్రారంభించడం తనకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  తాము అధికారంలోకి వచ్చిన తరువాత 3200కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామన్నారు. దీని ద్వారా రోజుకు 19మిలియన్ల యూనిట్ విద్యుత్ ఏపీ గ్రిడ్ కు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు, కృష్ణపట్నం పోర్టుకు భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ సిఎం కృతజ్ఞతలు తెలియజేశారు. 16, 337 నాన్ ఫిషెర్మెన్ కుటుంబాలకు 36కోట్ల పరిహారాన్ని వారి అకౌంట్లలో జమ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్