అధికారమంటే అజమాయిషీ చేయడం కాదని, అధికారమంటే ప్రజలపట్ల మమకారం చూపడమని,
ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకేసే బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ఉండి ఏ కారణంచేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇచ్చి పతకాలు అందిస్తోన్న బై యాన్యువల్ కార్యక్రమంలో భాగంగా నేడు 2,62,169 మందికి వివిధ పథకాల ద్వారా 216.34 కోట్ల రూపాయల ప్రయోజనం కల్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారి అకౌంట్లలో జమ చేశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…
⦿ ఏ పథకంలోనైనా అర్హత ఉండీ, ఏ కారణం చేతనైనా అందాల్సిన లబ్ధి అందకపోయిన పరిస్థితులు ఉంటే, అలాంటి వారికి మంచి చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం
⦿ గత ఆరునెలలుగా అమలు చేసిన పథకాల్లో వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన వారికి వారి ఖాతాల్లోకి నేరుగా రూ.216 కోట్లు జమచేస్తున్నాం
⦿ కొత్తగా పెన్షన్ కార్డులు, బియ్యంకార్డులు, ఆరోగ్యశ్రీకార్డులు, ఇళ్లస్థలాలుకూడా ఇస్తున్నాం
⦿ కొత్తగా 1,49,875 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నాం
⦿ 2,00,312 మందికి బియ్యంకార్డులు, 4,327 మందికి ఆరోగ్య శ్రీ కార్డులు, 12,069 మందికి ఇళ్లపట్టాలు ఇస్తున్నాం
⦿ గత ప్రభుత్వ హయాంలో 2018 అక్టోబరు దాకా, ఎన్నికలకు ఆరునెలలకు ముందు వరకూ 39 లక్షల మాత్రమే పెన్షన్లు ఉండేవి, ఇప్పుడు 64.27 లక్షల మందికి ఇస్కుతున్నాం
⦿ అప్పట్లో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకూ వేయి రూపాయలు మాత్రమే ఇచ్చే వారు, ఇవాళ రూ.2750లు ఇస్తున్నాం
⦿ బియ్యం కార్డుల సంఖ్య కూడా 1.44 కోట్లకుపైగా చేరింది, ఆరోగ్య శ్రీ కార్డులు కూడా 1.42 కోట్లుపైనే చేరింది
⦿ మొత్తం మంజూరుచేసిన ఇళ్లపట్టాల సంఖ్య 30,84,935కు చేరుకుంది
⦿ జగనన్నచేదోడు, వైయస్సార్ ఈబీసీ నేస్తం, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ మత్స్యకార భరోసా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు- ఇన్‌పుట్ సబ్సిడీ, వైయస్సార్ ఆసరాల కింద మిగిలిపోయిన వారికి లబ్ధి చేస్తున్నాం
⦿ జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికీ సచివాలయసిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్లి జల్లెడపట్టి మరీ 94,62,184 మందికి రకరకాల సర్టిఫికెట్లు జారీచేశాం
⦿ 12,405 మందికి అర్హులైన వారిని గుర్తించి వారికి కూడా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాం
⦿ జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా కొత్తగా అర్హులైన 1630 మందికి కూడా లబ్ధి చేకూరుస్తున్నాం