Tuesday, September 17, 2024
HomeTrending NewsYS Jagan: మట్టినుంచి పెరిగిన ఈ మొక్కలు....: సిఎం ఆకాంక్ష

YS Jagan: మట్టినుంచి పెరిగిన ఈ మొక్కలు….: సిఎం ఆకాంక్ష

మాణిక్యాలన్నీ మట్టిలోనే తేలుతాయని, అరక దున్నినప్పుడు వజ్రాలు బయటికి వస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్ధులకు ఉద్బోధించారు. సంకల్పం గట్టిదైతే రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పారు. ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుకొని పది, ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో సిఎం సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ‘టాప్ ర్యాంకులు తెచ్చుకున్నమీరే కాదు.. మీతోపాటు ఏ ర్యాంకూ తెచ్చుకోలేని వాళ్లు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్’ అన్నారు.  గవర్నమెంట్ బడుల్లో కార్పొరేట్ కాలేజీలకు మించి సదుపాయాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.  గవర్నమెంట్ బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు.

సిఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • ఈరోజు బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్స్, ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్..మీకు, మీ తల్లిదండ్రులకు, గొప్పగా చదువులు చెప్పిన టీచర్లందరికీ గ్రాండ్ వెల్‌కమ్
  • ప్రతి ముఖంలో కాంతి కనిపిస్తోంది. ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది. ఇది నిజంగా ఇవి నాకు చాలా నచ్చాయి.
  • మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. ఈరోజు మహా వృక్షాలై, ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలి
  • మిమ్మల్నందరినీ చూస్తుంటే గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక మరింత పెరుగుతోంది.
  • పేద పిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదని మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది.
  • ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీతో బయటకు రావాలి. ఈ క్రమంలో ఏ పిల్లాడు గానీ, తల్లిదండ్రులు గానీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు.
  • డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండాలని అనే తాపత్రయంతో విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

  • డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇటువంటివన్నింటికీ మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది.
  • విదేశాల్లో కూడా టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో.. ప్రతి పిల్లాడికీ సీటు తెచ్చుకోండి.. మీకు మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటీ 25 లక్షలు అయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు.
  • రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా బడులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం.
  • మన పిల్లలందరూ కూడా ప్రతి రంగంలోనూ ఎదగాలి. ఎదగడం కూడా కాదు.. ఎగరాలి.
  • ప్రపంచంలో వస్తున్న ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్.. వీటిని అనుసరించేవారుగా మన వాళ్లు ఉండకూడదు.. వీటిలో ప్రతి రంగంలోనూ ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.
  • ఇది జరగాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి.
  • అందుకే ఈ నాలుగు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ దేశంలో ఎవరూ పెట్టి ఉండరు.
  • రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ బడుల్లో ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది.
  • రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ పరీక్షల మాదిరిగానే మన పరీక్ష పత్రాలు కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
  • గవర్నమెంట్ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాలు రేప్పొద్దున ప్రపంచాన్ని ఏలే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. మనం చూస్తాం.
  • లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచే విధంగా మన చదువులు ఉన్నాయి.
  • టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోవడమే కాకుండా చదువులు వేగంగా మారుతున్నాయి.

  • ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్సెస్, మెషీన్ లెర్నింగ్, ఛాట్ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ ఎంతగా ఎదగాలన్నది ఆలోచించాలి.
  • ఆ స్థాయిలో ఎడ్యుకేషన్ రంగం మారబోతోంది. మార్పు చేస్తాం. ఈ మార్పును ప్రతి పేద వాడికి తీసుకురావాలి.
  • 4 స్థాయిల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది 22,768 మంది టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాప్ ర్యాంకుల్లో నిలిచిన పిల్లలను సత్కరించడం జరుగుతోంది.
  • ఇది ప్రత్యక్షంగా పేద పిల్లలకు, వారి తల్లిదండ్రులు, పరోక్షంగా గవర్నమెంట్ బడికి, గవర్నమెంట్ బడుల్లో పాఠాలు చెబుతున్న ఆ టీచర్లకు ఇది సన్మానం
  • ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం.
  •  ఇంకా గొప్ప మార్పులు చూపిస్తూ మంచి రిజల్ట్ తో ముందుకు రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా

అని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్