Friday, September 20, 2024
HomeTrending NewsRajya Sabha Polls: సిఎంను కలిసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు

Rajya Sabha Polls: సిఎంను కలిసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎంపిక చేశారు. ఈ మూడు పేర్లనూ గతవారమే ఖరారు చేయగా నేడు అధికారికంగా ప్రకటించారు.  ఈ  ముగ్గురూ అసెంబ్లీలో ఆవరణలోని  సిఎం కార్యాలయంలో జగన్ ను కలిసి  కృతజ్ఞతలు తెలియజేయగా సిఎం వారిని అభినందించారు.

గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన తప్పిదాన్ని పునరావృతం కాకుండా చూడాలని పార్టీ విప్ లకు  జగన్ సూచించారు. ఒక్కో అభ్యర్ధికి ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎవరెవరిని  కేటాయించాలనే దానిపై ప్రణాళికాబద్ధంగా ఉండాలని ఆదేశించారు.

వైసీపీని వీడిన, టిక్కెట్లు నిరాకరించిన ఎమెల్యేలు తమకు మద్దతిస్తారనే భావనలో టిడిపి ఉంది. అందుకే తమ పార్టీ తరఫున కూడా అభ్యర్ధిని బరిలో దించుతామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 15 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉండడంతో రెండు మూడు రోజుల్లో దీనిపై చంద్రబాబు ఓ స్పస్థత ఇవ్వనున్నారు.

వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు ఈనెల 12న సోమవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్