New Cabinet: సీనియర్ రాజకీయ నేత ధర్మాన ప్రసాదరావుకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన స్పీకర్ తమ్మినేని సీతారాం కు చుక్కెదురైంది. రాష్ట్ర నూతన మంత్రివర్గ జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఖరారు చేశారు. పాత మంత్రివర్గం నుంచి మొత్తం తొమ్మిది మందికి కొనసాగింపు లభించింది. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పల రాజు, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాషా, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, మాడుగుల శంకర నారాయణలకు మళ్ళీ చోటు దక్కింది. అయితే పదో పేరు విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. బుగ్గన రాజేంద్రనాథ్ కొనసాగింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది.
జిల్లాల వారీగా మంత్రుల జాబితా ఈ విధంగా ఉంది. (పాత జిల్లాల వారీగా)
శ్రీకాకుళం
1. ధర్మాన ప్రసాదరావు
2. సీదిరి అప్పలరాజు
విజయనగరం
3. బొత్స సత్యనారాయణ
4. పీడిక రాజన్నదొర
విశాఖపట్నం
5. భాగ్యలక్ష్మి
6. గుడివాడ అమర్నాథ్
తూర్పుగోదావరి
7. దాడిశెట్టి రాజా
8. చిట్టి బాబు
9. చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ
పశ్చిమగోదావరి
10. కారుమూరి నాగేశ్వరరావు
11. గ్రంధి శ్రీనివాస్
కృష్ణా
12. జోగి రమేష్
13. కొడాలి నాని
14. కొక్కిలిగడ్డ రక్షణనిధి
గుంటూరు
15. విడదల రజనీ
16. మేరుగు నాగార్జున
ప్రకాశం
17. ఆదిమూలపు సురేష్
నెల్లూరు
18. కాకాని గోవర్థన్ రెడ్డి
చిత్తూరు
19.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప
20. ఎండీ అంజాద్ బాషా
21. కొరుముట్ల శ్రీనివాసులు
కర్నూలు
22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
23. గుమ్మనూరు జయరాం
అనంతపురం
24. జొన్నలగడ్డ పద్మావతి
25. మాడుగుల శంకర్ నారయణ
ఈ జాబితా అధికారికంగా ప్రురకటించాల్సి ఉంది.
Also Read : ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?