Thursday, January 23, 2025
HomeTrending NewsAPPSC: గ్రూప్-1 & 2 పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్

APPSC: గ్రూప్-1 & 2 పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్

గ్రూప్‌-1. గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌ సిగ్న్‌ ఇచ్చారు. ఈ ఉదయం అధికారులు పోస్టుల భర్తీపై వివరాలు ముఖ్యమంత్రికి అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.

గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం సూచించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్