Saturday, January 18, 2025
HomeTrending NewsCM Jagan: కరువు సీమ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ

CM Jagan: కరువు సీమ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ

పక్కనే శ్రీశైలం ఉన్నా పత్తికొండ, డోన్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొందని, డోన్‌లో అయితే ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీని దృష్టిలో ఉంచుకునే…. రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన బిడ్డగా ఈ ప్రాంతానికి తోడుగా నిలబడేందుకు 253 కోట్ల  రూపాయల ఖర్చుతో  హంద్రీనీవా ద్వారా మొత్తం 77 చెరువులకు నీరందించే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నామన్నారు. లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి   రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లతో ఈ 77 చెరువులు నింపుతామని  వెల్లడించారు. అత్యంత కరువుతో అలరారే 8 మండలాలలోని 10,130 ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందుతుందని చెప్పారు. నంద్యాల జిల్లా డోన్ లో చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

సిఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచాం.
  • హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ప్రాజెక్టుకు నీళ్లు కేటాయిస్తూ 57 కోట్లు ఖర్చు చేసి ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది.
  • ఈ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప వ్యవసాయం జరగదని తెలిసి కూడా ఏ రోజు కూడా చెరువులు నింపాలని ఆలోచన చేయలేదు.
  • కేవలం ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు, టెంకాయలు గుర్తుకొస్తాయి, జీవో కాపీ గుర్తుకొస్తుంది. ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన, తపన ఎప్పుడూ రాదు.
  • రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా తోడుగా నిలబడేందుకు ఆదుకొనేందుకు అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమాన్ని నాన్నగారు 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు.
  • ఈరోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. పడితే ఒకేసారి కుంభవర్షం పడుతోంది. నీళ్లు స్టోర్ చేసుకోలేకపోతే ఆ తర్వాత వరదలు వచ్చే రోజులు తక్కువే.
  • పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మీ బిడ్డ ప్రభుత్వంలో 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్తూ అడుగులు పడుతున్నాయి.
  • 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ ను తీసుకొచ్చి 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడులో వేసే కార్యక్రమం జరుగుతోంది.
  • గతంలో పాలకులను చూశాం పోతిరెడ్డిపాడులో నీళ్లు పడాలంటే శ్రీశైలం నిండితే గానీ నీళ్లు రాని పరిస్థితి.
  • 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ నిండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల్లో మాత్రమే నీళ్లు తీసుకొనే పరిస్థితి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతామా?
  • అందుకే రాయలసీమ ప్రజలకు తోడుగా ఉండేందుకు 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
  • కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాలోని వెలిగొండ  మొదటి టన్నెల్ పూర్తి చేశాం. రెండో టన్నెల్ రేపు నెల అక్టోబర్లో జాతికి అంకితం చేయబోతున్నాం.
  • గండికోట కెపాసిటీ 27 టీఎంసీలు అయితే  కనీసం 12 టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితి.
  • చిత్రావతి 10 టీఎంసీల కెపాసిటీ, కేవలం మూడు నాలుగు టీఎంసీలు నీళ్లు పెట్టలేని పరిస్థితి.
  • బ్రహ్మం సాగర్ 17 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లే అందని పరిస్థితి.
  • మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్టులో కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచాం.
  • ఆర్ఆర్ కు సంబంధించిన డబ్బులు ఇచ్చాం.
  • ఈ రోజు ఈప్రాజెక్టులో పూర్తిగా నీటి నిల్వ చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా.
  • గతానికి ఇప్పటికీ తేడాను గమనించమని అడుగుతున్నా.
RELATED ARTICLES

Most Popular

న్యూస్