రాష్ట్రంలో వైద్య సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి లో నిర్మించిన 500 ఆక్సిజన్ పడకల కోవిడ్ ఆస్పత్రిని ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. 5.50 కోట్ల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది.
]రాయలసీమ కోవిడ్ బాధితులకు మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో, అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రి లో ఈ కోవిడ్ హాస్పిటల్ నిర్మించారు. తాడిపత్రి లోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆక్సిజన్ ను ఈ ఆస్పత్రిలో ఉపయోగిస్తారు.
సీఎం జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన… జర్మన్ హ్యాంగర్ విధానంలో కేవలం 15 రోజుల్లోనే కోవిడ్ హాస్పిటల్ నిర్మాణం పూర్తి అయ్యేలా అనంతపురం జిల్లా అధికారులు కృషి చేశారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ ఆస్పత్రి నిర్మాణానికి సహకరించింది.