Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రతి అసెంబ్లీలో నైపుణ్య సంస్థలు: మేకపాటి

ప్రతి అసెంబ్లీలో నైపుణ్య సంస్థలు: మేకపాటి

అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సిఎం జగన్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కనీస విద్యార్హతలు, నైపుణ్యం ఉన్న యువత ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, దీని దృష్టిలో ఉంచుకునే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అనంతపురం జిల్లాను బయో టెక్ హబ్ గా మారుస్తామని చెప్పారు.
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని కోడూరువద్ద నెలకొల్పిన తొలి బయోటెక్నాలజీ పరిశ్రమ ఇండస్ జీనీ ఎక్స్ ప్రెషన్స్ లిమిటెడ్ ను మేకపాటి సందర్శించారు.

కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సర్వీసులను నడిపే విధంగా విమానాశ్రయాన్ని ప్రభుత్వం తీసుకొని నిర్వహించడానికి గల మార్గాలపై సత్యసాయి ట్రస్టు సభ్యులతో గౌతమ్ రెడ్డి చర్చించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపి గోరంట్లమాధవ్‌, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, సిద్ధారెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్