Monday, March 16, 2026
HomeTrending Newsదుర్గగుడి అభివృద్ధి పనులకు సిఎం శ్రీకారం

దుర్గగుడి అభివృద్ధి పనులకు సిఎం శ్రీకారం

బెజవాడ  శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. జగన్‌కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించాగం అధికారులు  తీర్ధప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్టు, ఎమ్మెల్సీ మహమ్మద్‌ రుహుల్లా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌. సత్యనారాయణ, దేవస్ధానం ఈవో కెఎస్‌ రామరావు, వేదపండితులు. ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular