ధర్మప్రచారం ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ధర్మపథం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా. కే. జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో, అయన ఆదేశాలతో టిటిడిలో వంశపారంపర్య అర్చకత్వం, గొల్ల సన్నిధి పునరుద్ధరణ, తగ ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. దుర్గ గుడి అభివృద్ధి పనులకు 70 కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు.