Tuesday, September 17, 2024
HomeTrending NewsCM Jagan: సంపూర్ణ పోషణ టేక్‌ హోంకు శ్రీకారం

CM Jagan: సంపూర్ణ పోషణ టేక్‌ హోంకు శ్రీకారం

గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ – టేక్‌ హోం రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు సిఎం జగన్ చేతులమీదుగా డ్రైరేషన్‌ అందుకున్నారు. గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. వైయస్సార్సీపీ ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు అని వెల్లడించారు.  మహిళా, శిశు సంక్షేమ శాఖపై  జగన్‌ సమీక్ష నిర్వహించారు.

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ కింద నెలకు అందే రేషన్‌ సరుకులు:
2 కేజీల రాగి పిండి.
1 కేజీ అటుకులు.
250 గ్రాముల బెల్లం.
250 గ్రాముల చిక్కీ.
250 గ్రాముల ఎండు ఖర్జూరం.
3 కేజీల బియ్యం.
1 కేజీ పప్పు.
అర లీటరు వంటనూనె.
25 గుడ్లు.
5 లీటర్ల పాలు.

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కింద అందే రేషన్‌ సరుకులు:
1 కేజీల రాగి పిండి.
2 కేజీల మల్టీగ్రెయిన్‌ఆటా.
500 గ్రాముల బెల్లం.
500 గ్రాముల చిక్కీ.
500 గ్రాముల ఎండు ఖర్జూరం.
3 కేజీల బియ్యం.
1 కేజీ పప్పు.
అర లీటరు వంటనూనె.
25 గుడ్లు.
5 లీటర్ల పాలు.

ఫౌండేషన్‌ స్కూల్‌లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని,  ఇంగ్లిషు భాషలో పరిజ్ఞానం, ఉచ్ఛారణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలని, అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి ఏవైనా సమస్యలుంటే తగిన నాణమైన  వైద్యాన్ని అందించాలని సిఎం సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్