Sunday, January 19, 2025
HomeTrending Newsకొనుగోలు విషయంలో రైతుకు స్వేఛ్చ

కొనుగోలు విషయంలో రైతుకు స్వేఛ్చ

Freedom: రైతన్నకు మరింత చేయూత అందించేందుకే  వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా వారికి  కావాల్సిన పనిముట్లన్నీ అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లోనే, తక్కువ ధరలోనే వారికి ఈ సేవలు అందుబాటులో  ఉంచుతున్న్ననామన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నామని,  మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నామని వివరించారు.  వైయస్సార్‌ యంత్ర సేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా ఆర్బీకే, క్లస్టర్  స్ధాయిలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం జెండా ఊపి ప్రారంభించారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల రూపాయల ప్రభుత్వ సబ్సిడీ జమ చేశారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువగల 10,750 వైయస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.  ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని సిఎం  ప్రకటించారు.

రైతులు తమకు కావాల్సిన కంపెనీ ట్రాక్టర్ ను కొనుగోలు చేసే స్వేచ్ఛను తాము ఇచ్చామని,  కానీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం  ట్రాక్టర్ డీలర్లతో కుమ్మక్కై స్కాం  చేశారని జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారని అవి కూడా రైతులు సొంతంగా ఆర్డర్లు ప్లేస్‌ చేయలేదని గుర్తు చేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడాను గమనించాలని, ఇప్పుడు తాము  ట్రాక్టర్‌ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా  నేరుగా వాటిని కొనుగోలు చేసుకునే స్వేఛ్చ  రైతుకే వదిలిపెట్టామని చెప్పారు. ఇవాళ 175 ట్రాక్టర్ల మోడళ్లలో రైతులకు నచ్చిన మోడల్‌ కొనుగోలు చేసే అవకాశం ఇచ్చామని జగన్‌ వివరించారు.

Also Read : మరింతగా సేవ చేస్తా: జగన్ హామీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్