Saturday, September 21, 2024
HomeTrending Newsఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగనే సిఎం: జోగి ధీమా

ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగనే సిఎం: జోగి ధీమా

దేశంలో 28 రాష్ట్రాలుంటే సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.  ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఒకచోటకు వచ్చి మా లీడర్‌ జగనన్న అని కదం తొక్కుతున్నారన్నారు. కేబినెట్‌లో 25 మంyennది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి సామాజికధర్మం పాటించారని ప్రశంసించారు.

నందిగామలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు వేలాది ప్రజలు సాదర స్వాగతం పలికారు.  జై జగన్‌ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాస్‌, కైలే అనిల్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్‌, మొండితోక అరుణ్,  కుంబా రవిబాబు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, జూపూడి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జోగి మాట్లాడిన ముఖ్యాంశాలు:
* 14 ఏళ్లు సీఎంగా ఉన్నచంద్రబాబు ఇలా ఏనాడైనా సామాజిక న్యాయం చేశాడా?
* నలుగురు బీసీలను జగనన్న రాజ్యసభకు పంపారు.
* వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేసి కనకమేడల రవీంద్రకు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు
* బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని జగనన్న స్పూర్తిగా తీసుకున్నారు.
* జ్యోతిరావుపూలే లాగా జగనన్న ఆలోచన చేశాడు.
* జగనన్నను ఎదుర్కోవాలంటే చంద్రబాబు, టీడీపీ చాలదంట. పొత్తులు కావాలంట.
* నువ్వు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరితో పొర్లాడినా 2024లో వైయస్సార్‌సీపీ జెండా రెపరెపలాడబోతోంది.
* బీసీలకు పెద్దపీట వేసినందుకు, మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు, అగ్రవర్ణ పేదలను ఆదుకుంటున్నందుకు జగనన్నను ఓడిస్తారా?
* చంద్రబాబు, పవన్‌ వగైరా ఎవరైనా కట్ట కలిసి వచ్చినా కృష్ణా నదిలో కలిపేయడం ఖాయం.
* రేపు రాబోయే ఎన్నికలు పేద వాడికి, పెత్తందార్లకు జరిగే యుద్ధం.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలంతా జగనన్నతో అడుగులు వేద్దాం.

కర్నూలులో…

కర్నూలు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. పెద్దఎత్తున  ప్రజలు తరలి వచ్చారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున హాజరు కావడం కనిపించింది.

స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్‌కుమార్, మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎంపీ బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిలతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నాయకుల ఉపన్యాసాలు బాగా సాగాయి. జైజగన్‌ నినాదాలతో సభాస్థలి హోరెత్తింది.

గోపాలపురంలో….

రాజమండ్రి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది. పెద్దఎత్తున ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు తావేటి అనిత, కారుమూరి నాగేశ్వర రావు, ఎంపి నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్