బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్లాక్ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు, వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి తగిన ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం నోటిఫైడ్ ఆస్పత్రులను గుర్తించాలని సిఎం సూచించారు.
కాగా డయాబెటిక్, విపరీతంగా స్టెరాయిడ్స్ వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామని సమావేశంలో అధికారులు సిఎంకు వివరించగా, ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని వైయస్ జగన్ ఆదేశించారు.