Saturday, January 18, 2025
HomeTrending Newsరుయా ఘటనలు మళ్ళీ జరగొద్దు: సిఎం ఆదేశం

రుయా ఘటనలు మళ్ళీ జరగొద్దు: సిఎం ఆదేశం

No Negligence: రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని ఆదేశించారు. ఒకటి రెండు ఘటనల వల్ల  మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని,  అలాంటి పరిస్థితి రాకూడదని, ఈ తరహా ఘటనల నివారణకు సమర్థవంతమైన ప్రోటోకాల్‌ ఉండాలని, అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలని సూచించారు.

కోవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం జగన్‌ పాల్గొన్నారు.  తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అనంతరం అనంతరం వైద్య,ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు

⦿ కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి

⦿ 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలి

⦿ దీనివల్ల ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది

⦿  విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన  చర్యలు తీసుకోవాలి

⦿ పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలి

⦿ అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారు

⦿ ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలి.

⦿ దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలి.

⦿ ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత కఠినంగా వ్యవహరించాలి.

⦿ విద్య, వైద్యం–ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి.

⦿ ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తో పాటు సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి,  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు,

Also Read : నీతి ఆయోగ్ సదస్సులో సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్