Sunday, March 15, 2026
HomeTrending Newsమరమ్మతులు వెంటనే చేపట్టండి: సిఎం జగన్

మరమ్మతులు వెంటనే చేపట్టండి: సిఎం జగన్

CM Jagan review on Roads:

వచ్చే ఏడాది జూన్‌ నాటికి రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేపట్టాలని సూచించారు.  రహదారులపై ఉన్న గుంతలు తక్షణమే పూడ్చాలని, వెంటనే పనులు ప్రారంభించాలని దిశా నిర్దేశం చేశారు. రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం సూచనలు

రాష్ట్రంలోని మొత్తం 46 వేల కిలోమీటర్ల రోడ్లు ఒక యూనిట్‌గా తీసుకోండి

ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మత్తులు చేయాలి

ముందు పాట్‌ హోల్‌ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలి, తర్వాత కార్పెటింగ్‌ పనులు పూర్తిచేయాలి

విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు అందుబాటులోకి రావాలి

ఎక్కువగా డ్యామేజ్‌ అయిన రోడ్లపై వెంటనే దృష్టిపెట్టండి

రోడ్లు మరమ్మత్తులు చేసిన తర్వాత తేడా కనిపించాలి

ఇంత చేసిన తర్వాత మరొకరు విమర్శించే అవకాశం ఉండకూడదు

ఎన్‌డీబీ ప్రాజెక్టుల్లో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టండి

అన్ని బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు కూడా కవర్‌ చేయాలి

ఆర్‌వోబీలు, బ్రిడ్జిలు కూడా ఫేజ్‌-1 పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించండి

నాడు-నేడు తరహాలో ప్రతీ రోడ్డు కూడా ఫోటోలు ఉండాలి,

 రోడ్లు రిపేర్‌ చేసేముందు ఫోటోలు తీయండి, రిపేర్‌ చేసిన తర్వాత కూడా ఫోటోలు తీయాలి

కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు, మెయింటెనెన్స్‌ మీద ముందు దృష్టి పెట్టండి

నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయండి

పంచాయతీల పరిధిలోని రోడ్ల మరమ్మత్తులు కూడా పూర్తవ్వాలి

వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారు

ఏపీ పెండింగ్‌ ప్రాజెక్టుల వివరాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి

మేజర్‌ రోడ్లకు ట్రాఫిక్‌ను బట్టి ఏ మేరకు మరమ్మత్తులు చేయాలనేదానిపై సమావేశంలో వివరించిన అధికారులు

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ ల వివరాలు, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగిన సీఎం

అర్జెంట్‌ రిపేర్లు చేయాల్సిన పనుల స్టేటస్‌ వివరించిన అధికారులు

వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్న అధికారులు

ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తిచేసి 8268 కి.మీ. రోడ్ల మరమ్మత్తులు వెంటనే మొదలుపెడతామన్న అధికారులు

వర్షాలు తగ్గగానే డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకు అన్ని రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేస్తామన్న అధికారులు

పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ది శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టీ.కృష్ణబాబు, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ.సత్యనారాయణ, పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఎం ఎం.నాయక్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular